తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జరీనా వహాబ్, నందితాదాస్, ప్రియమణి, […]
ప్రముఖ నటుడు రానా, మిహీకాల పెళ్లి శనివారం రాత్రి రామానాయూడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దిమంది బంధుమిత్రలు సమక్షంలో వివాహవేడకను నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రానా, మిహికా జంట ఒక్కటయ్యారు. గత మే నెలలో తాను మిహీకా బజాజ్ ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంలో వివాహం ఖాయమైంది.
అరగంట నిడివి ఉన్న ఓ పాత్రలో నటించేందుకు హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకున్నట్టు సమచారం. రానా హిందిలో నటిస్తున్న ‘ హాథీ మేరీ సాథీ’ అనే చిత్రంలో కాజల్ ఓ ఆదివాసి మహిళ పాత్రను చేస్తున్నది. ఈ సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఈ పాత్రలో గ్లామర్డోస్ […]
ఇండస్ట్రీలో హిట్ సినిమాల రీమేక్ ల ముచ్చట కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన సినిమాలను ఆయా భాషల వాళ్లు రీమేక్ చెయ్యడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయ్యింది కూడా. అందుకే ఏ సినిమా అయినా రిలీజై హిట్ అయితే మాత్రం వెంటనే ఆ సినిమా రైట్స్ ను దక్కించుకునే పనిలో పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ కేటగిరీలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంతకు ‘ప్రేమమ్’ లాంటి మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసింది. […]
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. విశాల్ తాజా చిత్రం ‘చక్ర’ ట్రైలర్ రిలీజైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తూ నటించాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో ఒకేసారి […]
‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఇప్పుడో కొత్త ప్రయోగానికి సాహసం చేస్తున్నాడు. మొదటి చిత్రం ‘అయ్యారే’ కి అంత గుర్తింపు రాకపోయినా 2016లో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలతో తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా సాగర్‌కు మంచి గుర్తింపునిచ్చింది. దీంతో అతడు సితారా ఎంటర్టెయిన్మెంట్ వారు నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేశాడు. మలయాళంలో బిగ్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ను సితార సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రానా త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మిహికా బజాజ్ ను ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో మిహికాతో కలిసి తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వడమే కాదు.. రీసెంట్గా పెద్దల సమక్షంలో రోకా ఫంక్షన్ కూడా జరుపుకుని ఆగస్టు 8న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా రానా పెళ్లి వాయిదాపడింది అంటూ పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. కానీ […]
దగ్గుబాటి వారి ఇంట్ల ఇక పెళ్లి బాజా మోగనుంది. రానా, మిహికా బజాజ్ ఏడడుగులు నడవనున్నారు. ఇరువురి మోములో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల రామానాయుడు స్టూడియోలో రోకా వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 8న మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించారు. ‘కరోనా సమయంలో ఎక్కడికి వెళ్లలేం కదా.. హైదరాబాద్‌లోనే పెళ్లివేడుక ఉంటుంది’ రానా తండ్రి, ప్రముఖ నిర్మాణ దగ్గుబాటి సురేశ్‌బాబు వెల్లడించారు