సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్‌మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్ ట్వీట్ చేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు
సారథిన్యూస్, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ బొంతు రామ్మోహన్, వివిధ శాఖల […]