Breaking News

RAMADUGU

ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు. […]

Read More
మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు తెలంగాణ మోడల్ స్కూలులో 2020-21 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఈ నెల 8 వరకు చివరి తేదీ అయినందున అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ ను స్కూలులో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telangana ms.cgg.gov.in సంప్రదించాలని తెలిపారు.

Read More
కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

కరోనా బాధితుల పట్ల సర్పంచ్​ ఉదారత

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్​ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్​ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ […]

Read More
మామిడి తోటకు పెళ్లి

మామిడి తోటకు పెళ్లి

సారథి, రామడుగు: తొలిసారి కాపుకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి జరిపించారు. రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్య తన సొంత వ్యవసాయ పొలంలో మూడెకరాల విస్తీర్ణంలో మామిడి తోట సాగుచేశారు. మొదటి సారి కోత దశకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి చేశారు. గురువారం పురోహితుడు రామస్వామి పంతులు సమక్షంలో శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణ మధ్య కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ తంతు నిర్వహించారు.

Read More
అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో నివారణకు కరీంనగర్ ​జిల్లా రామడుగు గ్రామపంచాయతీ పాలకవర్గం కొద్దిరోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగానే బుధవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలతో పాటు వార్డుల్లో సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, పాలకవర్గ సిబ్బందితో కలిసి హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించి […]

Read More
ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

సారథి, రామడుగు: రాజకీయాల్లో ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఎమ్మెస్సార్ సొంత గ్రామమైన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్సార్ తెలంగాణ వాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏఐసీసీ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా విశిష్టసేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెస్సార్ మరణం తెలుగు ప్రజలకు […]

Read More
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్​ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి విధంగా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పెసరి రాజమౌళి నాయకులు అశోక్, పంజల జగన్మోహన్ మామిడి తిరుపతి, మాదం రమేష్, […]

Read More
స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్టార్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడి గైని తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా అహ్మద్, ఉపాధ్యక్షుడిగా మాడిశెట్టి సంతోష్, బాసవేని సాగర్, కోశాధికారిగా షాదుల్లా, కార్యదర్శలుగా శ్రీను, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, లక్ష్మీపతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, అస్రత్, జబిఉల్లాఖాన్, బి.శ్రీను, ఓదేలు, తిరుపతి, ప్రదీప్, రమేష్, సింహచారి, అబ్దుల్లా, పోచమల్లు, లక్ష్మణాచారి, వేణు, రాజు, డి.వేణు, ప్రధాన సలహాదారుగా రాగం […]

Read More