Breaking News

RAJASTHAN

సచిన్​పైలట్​కు ఊరట

ఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్​ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్​ పైలట్​ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్​ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని […]

Read More

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More

ఆ వాయిస్​ నాదికాదు

జైపూర్‌‌: కాంగ్రెస్‌ పార్టీ తనపై కావాలనే ఆరోపణలు చేస్తోందని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌ అన్నారు. కాంగ్రెస్‌ తనపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్దం అని చెప్పారు. కేంద్ర మంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు చేశారని, దానికి సంబంధించి ఆడియో టేప్‌లు కూడా బయటికొచ్చాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించిన నేపథ్యంలో షకావత్‌ వివరణ ఇచ్చారు. ఆ టేప్‌లో ఉన్న వాయిస్‌ తనది కాదని […]

Read More

బీజేపీలో చేరడం లేదు

న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్​ బహిష్కృత నేత సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్​ పైలట్​ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్​ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన […]

Read More

రాజస్థాన్​లో ట్విస్టుల మీద ట్విస్టులు

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్​ పైలట్​ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్​తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్​లోని ఫెయిర్​మోంట్​ హోటల్​లో జరిగిన కాంగ్రెస్​ శాసనాసభా […]

Read More

టార్గెట్​ అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్​లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్​ గెహ్లాట్​ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్​పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్​ గెహ్లాట్​ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్​ నేతలు, సీఎం అశోక్​ గెహ్లాట్​కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్​, రాజీవ్ అరోరా నివాసాలపై […]

Read More

రాజస్థాన్​లో ఏం జరుగుతోంది?

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రణ్​దీప్​ సూర్జేవాలా, అజయ్​ మకెన్​లు జైపూర్​కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్​ గెహ్లాట్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్​ పైలట్​ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం […]

Read More

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం

ఢిల్లీ: రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ ప్రకటించారు. రేపు రాజస్థాన్​లో జరగబోయే కాంగ్రెస్​ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్​లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్​కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]

Read More