Breaking News

RAJASTHAN

అశోక్​ గెహ్లాట్​ నెగ్గాడు

బలపరీక్షలో నెగ్గిన అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్​ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్​ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

Read More
రాజస్థాన్​ కథ సుఖాంతం

రాజస్థాన్​ పంచాయితీ సుఖాంతం

న్యూఢిల్లీ: రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్​ కీలక నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్​ పైలట్​, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్​ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు​ ఒప్పుకున్నారని కాంగ్రెస్​పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్​లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్​ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు […]

Read More
అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

జైపూర్​: సచిన్​ పైలట్​ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్​ గెహ్లాట్​కు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) సమన్లు జారీచేసింది. అగ్రసేన్​ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్​ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్​కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు […]

Read More
సుప్రీంకోర్టు పిటిషన్​ వాపస్​

సుప్రీంలో పిటిషన్​ వాపస్​

న్యూఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​చేస్తూ స్పీకర్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]

Read More
రాజస్థాన్​లో అదే ఉత్కంఠ

రాజస్థాన్​లో అదే ఉత్కంఠ

జైపూర్‌‌: రాజస్థాన్​లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్​, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్​తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్‌‌ కల్‌రాజ్‌ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్‌ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్‌ నేతలు […]

Read More

మరోసారి సుప్రీంకోర్టుకు

న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్‌ పైలెట్‌, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ స్పీకర్‌‌ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఉంది. […]

Read More
పైలట్​ దురాశ వల్లే సంక్షోభం

పైలట్​ దురాశవల్లే సంక్షోభం

జైపూర్​: సచిన్​ పైలట్​ దురాశ వల్లే రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్​ గెహ్లాట్​ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్​లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్​ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్​ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Read More

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]

Read More