సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రప్రభుత్వం త్వరలోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పురపాలకశాఖలో వార్డు ఆఫీసర్లు అనే కొత్తపోస్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో తన శాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. వార్డు ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. […]
సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు నిరసనకు దిగాడు. ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తంచేశాడు. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి సదరు నిరసనకారుడు ఎవరనే వివరాలను ఆరాతీస్తున్నారు. కాగా, పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పితే.. ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని అన్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ […]