సారథి న్యూస్, గోదావరిఖని: పారిశుద్ధ్య నిర్వహణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పరిసరాలను శుభ్రంచేశారు. గార్డెన్ లో చెత్తను తీసివేయడంతో పాటు నిలువ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. వృద్ధులు, […]
46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్ బెల్డ్ ఏరియాలో భానుడు భగభగ మండిపోతున్నాడు.. రోజురోజుకూ ఎండ, వడగాలుల తీవ్రత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలే వేసవి.. ఆపై రోహిణి కార్తె తోవడంతో సూరీడు తన ప్రతాపం మరింత చూపడంతో ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు పారిశ్రామికవాడలో జనం జంకుతున్నారు. జిల్లాలో వారం 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, ఎన్టీపీసీ, […]
ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సారథి న్యూస్, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్, పెద్దపల్లి […]
–రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడమే తమ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మిఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాస్టర్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ఫౌండేషన్ కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను అమలు చేయాలని […]
సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి): కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు కరోనా వ్యాప్తి కారణంగా కష్టాలు మొదలయ్యాయని, వారికి అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. గురువారం ఆయన గోదావరిఖని పట్టణంలోని సీఐటీయూ ఆఫీసులో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. కళాకారులంతా ఐక్యంగా ఉండాలని, త్వరలోనే వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ […]
సారథి న్యూస్, పెద్దపల్లి: కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో గురువారం కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సీఐ ఔదార్యం.. సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 30 మంది యాచకులకు బుధవారం తన సొంత ఖర్చులతో రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు భోజనాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనువాస్, కానిస్టేబుల్ సత్యం తదితరులు పాల్గొన్నారు.