Breaking News

NEWCASES

ఇండియాలో 13,28,336 కేసులు

ఇండియా @ 13,28,336

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 13, 28,336 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు 67.6 శాతం రికవరీ రేటు ఉందని కేంద్ర వైద్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కరోనాతో 40, 699 మంది మృతిచెందగా, 5,95,501 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

Read More
దేశంలో పెరుగతున్న కేసులు

52వేల కొత్త కరోనా కేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More
కోలుకున్నవారి సంఖ్య పెరుగుతున్నది

ఒకేరోజు 50 వేలమంది డిశ్చార్జ్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్తే. కేంద్ర వైద్యశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 51,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఇంతమంది కోలుకోవడం మనదేశంలో ఇదే ప్రథమం. కాగా ఇప్పటివరకు మొత్తం 11,45,629 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకున్నది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన […]

Read More
దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు

52 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More
కేరళలో పరిస్థితి మొదటికి..

కేరళలో మళ్లీ మొదటికి

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]

Read More
దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

47 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
కరోనా రోగులు మిస్సింగ్​

కరోనా పేషెంట్లు మిస్సింగ్​

బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్​నంబర్లు, అడ్రస్​ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వ‌ర‌కూ ఉన్నట్టు సమాచారం. వాళ్లంద‌రికీ క‌రోనా పాజిటివ్ […]

Read More