Breaking News

కేరళలో మళ్లీ మొదటికి

కేరళలో పరిస్థితి మొదటికి..

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.