సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]
సారథి న్యూస్, నర్సాపూర్: భూసమస్య చిన్నదే.. కానీ ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.. అధికారులూ పరిష్కరించడం లేదు. ఫలితంగా బాధిత రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. శివంపేట భూ సర్వేనం.315, 316లో దొంతి దొర ఇనాం భూములు కావడంతో అప్పట్లో రైతులు సంబంధిత వంశస్థుల నుంచి కొనుగోలుచేసి పట్టాలు పొందారు. 1954- 55 రెవెన్యూ కాస్రా రికార్డు ప్రకారం 315లో 533 ఎకరాల 28 గుంటలు, 316లో 574 ఎకరాల […]
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. గురువారం మెదక్‌జిల్లా నర్సాపూర్అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌జిల్లా కలెక్టర్ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్‌పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 […]
నర్సాపూర్ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్ టవర్‌లు, వాకింగ్, సైకిల్ ట్రాక్‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కులు, రిసార్ట్స్‌లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్‌లో అన్ని హంగులతో అర్బన్ పార్క్ రెడీ అయింది..కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక […]
సారథి న్యూస్, నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయిన ఓ యువకుడు.. ఏడాది కాలంగా మంచంపైనే నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం సాయం చేసేవారి కోసం వేయికండ్లతో ఎదురు చూస్తున్నాడు. వైద్యం కోసం అతడి కుటుంబం ఉన్న అరెకరం భూమిని అమ్ముకున్నది. నెలకు 40 వేలు ఖర్చుచేస్తున్నది. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం అర్థిస్తున్నది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటకు చెందిన దూదేకుల రబియా షాబుద్దీన్ ల ఏకైక కుమారుడు షాదుల్లా (24)కు […]
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రతిఒక్కరూ శుద్ధమైన నీటినే తాగాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కౌడిపల్లి మండలం రాయిలాపూర్ లో గ్రామ సామాజిక అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలంతా శుద్ధిచేసిన నీటినే తాగాలని కోరారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అడిషనల్ జేసీ నగేష్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కొత్తకాలనీ, ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల ఎదుట వేస్తున్న సీసీరోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, కాంట్రాక్టర్ రాజు, పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, ఉపసర్పంచ్ […]
సారథి న్యూస్, నర్సాపూర్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న నాటుసారాను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ పంచాయతీకి చెందిన కొందరు గిరిజనులు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అసిస్టెంట్ సూపర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10లీటర్ల నాటుసారా, 100 కేజీల నానబెట్టిన బెల్లం, బెల్లం ఊటను పారబోశారు. నాటుసారాను అమ్మినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని మాట్లాడుతూ చెప్పారు. ఆయన […]