Breaking News

NALLAMALA

రగిలిన పోడు భూముల వివాదం

రగిలిన పోడు భూముల వివాదం

అధికారులపై పెట్రోల్ పోసిన మహిళారైతు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం సారథి, అచ్చంపేట: నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమలలో పోడు భూముల వివాదం మరోసారి రగిలింది. అటవీశాఖ అధికారులు, ఆదివాసీ గిరిజనుల మధ్య అగ్గిరాజేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్రాబాద్ మండలం మాచారంలో 20 ఆదివాసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే గ్రామంలో సుమారు 60 ఎకరాల పోడు భూములను సాగుచేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. […]

Read More
మా భూములకు రక్షణ కల్పించండి

మా భూములకు రక్షణ కల్పించండి

సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం […]

Read More
బౌరాపూర్ లో వైభవంగా శివరాత్రి వేడుకలు

భౌరాపూర్ లో వైభవంగా శివరాత్రి వేడుకలు

సారథి న్యూస్​, అచ్చంపేట: మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో భ్రమరాంబదేవి, మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​ దంపతులు, కలెక్టర్​ ఎల్​.శర్మన్​ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చెంచులు తమ ఆరాధ్యదైవంగా భావించే భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణఘట్టాన్ని జరిపిస్తుంటారు. నల్లమల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Read More
నల్లమల లోయలో పడిన వ్యాను

నల్లమల లోయలో పడిన వ్యాన్​

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద 50 అడుగుల లోతులో ఉన్న లోయలో వ్యాన్​పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిన క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికి తీస్తున్నారు.క్షత్రగాత్రులను హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు.

Read More
పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]

Read More
భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్​రోడ్డులో నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]

Read More
తేనె కోసం వెళ్లి.. లోయలో పడి మృతి

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి ఇద్దరి మృతి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]

Read More
ఫస్ట్​డే చెంచుపెంటల టూర్​

ఫస్ట్ ​డే చెంచుపెంటల టూర్​

చెంచుల సమస్యలు తెలుసుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ పరిష్కరిస్తానని చెంచుబిడ్డలకు భరోసా సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లింగాల, అమ్రాబాద్‌ మండలాల పరిధిలోని అప్పాపూర్‌ చెంచుపెంటలకు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్​వాడీ సెంటర్, స్కూలును పరిశీలించారు. చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30మంది రైతులకు బ్యాంకు అకౌంట్ నంబర్లు లేవని, ఆశావర్కర్ […]

Read More