సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిషత్‌లో శనివారం నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. వాగ్వాదాలు, సవాళ్లు, చాలెంజ్ విసురుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరిమీదకు ఒకరూ కొట్టుకొనే స్థాయికి వెళ్లారు. సమావేశమంతా రసాబాసగా మారింది. ‘లక్షలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తుంటే.. మిషన్ భగీరథ ఏఈ రాఘవేంద్రరావు బిల్లులు చేయకుండా వేధిస్తున్నారని.. ఆయన లంచాలకు మరిగారని బిజినేపల్లి సర్పంచ్ బాల్ ఈశ్వర్ ధ్వజమెత్తారు. దీనిపై ఏఈ రాఘవేంద్రరావు కూడా తీవ్రంగా స్పందించారు. […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాపసభను గురువారం స్థానిక సీకేఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిసి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే.. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, నిగర్వి అని నేతలు కొనియాడారు. కొట్ర సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, తాండ్ర సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, టీఆర్ఎస్ వెల్దండ ప్రధాన కార్యదర్శి పొనుగోటి భాస్కర్‌రావు, పార్టీ నాయకులు బొల్లె ఈశ్వరయ్య, మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్, మాజీ వైస్ […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని బుధవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారికి వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం పనులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉందని సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. […]
సారథిన్యూస్, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సస్పెండ్ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నేత సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు బరిలోకి దిగి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో రైతు కుటుంబంలో 1947లో జన్మించారు. వ్యవసాయం వృత్తి కలిగిన ఆయన రాజకీయాల్లో […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కు ఎంపీ పోతుగంటి రాములు కృతజ్ఞతలు తెలిపారు.