గిరిజన విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం రూ.60వేలు అందజేస్తానని హామీ సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్ చదువుతున్న బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండాకు చెందిన కాట్రావత్శ్యామల అనే విద్యార్థినికి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఏటా చదువుల కోసం రూ.60వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి సంవత్సరం ఫీజు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా అర్హులైన ప్రతి చిన్నారికి నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ ఎస్.రాజేష్ గౌడ్ సూచించారు. ల్లాలోని బిజినపల్లి మండలంలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాలుగు గ్రామాలు, 27 గిరిజన తండాల్లో 4,335 చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 2 […]
సారథి న్యూస్, బిజినేపల్లి: గ్రామంలోని ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భ్రదత కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లను, ప్రభుత్వ, ప్రైవేట్ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చుకోవాలని నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్లైన్ప్రక్రియను క్షేత్రస్థాయిలో పాలెం గ్రామంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో ఉన్న ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: గ్రామంలోని ఇండ్లు, ఇతర అన్నిరకాల నిర్మాణాలకు భద్రత కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చాలని, నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం షాహిన్ పల్లి, అల్లిపూర్, సల్కరిపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో శిక్షణ సహాయ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి పరిశీలించారు. […]
సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి. […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద 50 అడుగుల లోతులో ఉన్న లోయలో వ్యాన్పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిన క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికి తీస్తున్నారు.క్షత్రగాత్రులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కల్వకుర్తి నేషనల్హైవే 167 నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూరు, కరివేన నేషనల్హైవే 340 ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని మంగళవారం నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు నేషనల్రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవేస్ సెక్రటరీ గిరిధర్‌ను కలిసి కోరారు. గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కోసం డీపీఆర్‌ను త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో […]
సారథి న్యూస్, బిజినేపల్లి: మహిళా సంఘాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కరిపేట గ్రామ మహిళా సంఘం సభ్యులు సోమవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సల్కరిపేట ఎంపీటీసీ సభ్యుడు అంజి మద్దతు తెలిపారు. మహిళలను మోసగించిన సమాఖ్య ఉద్యోగులను తొలగించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామసీసీ, బుక్ కీపర్ కలిసి మహిళా సంఘాలకు […]