సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులుగా స్థానిక భజన బృందం కళాకారులు ఆడిన పార్వతి కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది. ప్రేక్షకులు జేజేలు పలికారు. హైటెక్యుగంలోనూ కళలను బతికిస్తున్న కళాబృందాన్ని పలువురు అభినందించారు. జానపద, పౌరాణిక నాటకరంగ ఇతివృత్తం, సారాంశాన్ని నేటి తరానికి అందించాలని కోరారు. కళ ప్రజల కోసం, మంచి కోసం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. నాటకంలో తారాకాసురుడిగా కొప్పు వెంకటయ్య, […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్వేనం.363లో ఉన్న దళితుల భూమిని కబ్జాదారులు అక్రమంగా పట్టా చేయించుకుని వారిపైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేవీపీఎస్రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1957లో దళితులకు ఇచ్చిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పట్టాలు చేయించుకోవడమే కాకుండా ఆ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. పోరాడి సాధించుకున్న రూ.8,500 జీతాన్ని ఇప్పటికీ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఈనెల 12న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ మండల జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర తొలి పీఆర్సీ సిఫార్సుల ప్రకారం రూ.19వేల జీతం ఇవ్వాలని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత […]
సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్‌డౌన్‌ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్ 19 […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావుకు ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ అవార్డు […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్‌ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు […]