Breaking News

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్​గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్​పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత తగాదాలతో కొందరు నా చావుకు కారణమని’ వీడియో తీసి అదే గ్రామానికి చెందిన కొందరికి పంపించింది. వీడియో స్థానిక వాట్సప్ ​గ్రూపుల్లో వైరల్​ కావడంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేష్​​ దృష్టికి వచ్చింది. ఫోన్ కాల్ ఆధారంగా ఘటన స్థలాన్ని గుర్తించి సదరు యువతి ఉన్న ప్రదేశానికి పోలీసు బృందాలను పంపించారు. పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. చివరికి వడ్డెమాన్ ​గ్రామశివారులో పంట పొలాల మధ్య పురుగు మందు తాగి పడిపోవడం చూశారు. పోలీసులు తమ వాహనంలో మాధవిని హుటాహుటిన నాగర్​కర్నూల్ ​జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ట్రీట్​మెంట్​ అందించారు. ప్రస్తుతం బాధిత యువతి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎస్సై వెంకటేష్ సకాలంలో స్పందించిన తీరును చూసి పలువురు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఎస్సై కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.