రేకుల షెడ్‌కు కౌన్సిల్ ద్వారా డబ్బులు డ్రా చేసే యత్నం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సేవ పేరుతో ఓ కౌన్సిలర్ నిర్వాకం సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు కష్టకాలంలో తోడు నిలుస్తానని చెప్పాడు. మైనారిటీ వర్గానికి తాను అందరికీ పెద్దదిక్కులా ఉంటూ సదరు సామాజికవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని నమ్మించాడు. కరోనా కష్టకాలంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ తండ్రి పేర ముస్లింల కోసం ఓ గదిని నిర్మిస్తున్నానని చెప్పి విస్తృతంగా ప్రచారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ప్రగతి భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖ శ్యాంనాయక్ కలిశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరుచేసి సహకరించాలని కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ ఉన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ 20 19 – 20 వార్షిక నివేదికను బుధవారం మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రులు అన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రగతి భవన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రభావం, పట్టణ ప్రగతి, పబ్లిక్ మరుగుదొడ్లు, హరితహారం మొక్కల పెంపకం తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత సూచించారు. పట్టణంలోని 1,13వ వార్డుల్లో సోమవారం శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీకి కారణమయ్యే దోమలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, కల్పన, సుప్రజా, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఉన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, మర్లు, నలంద ఆటోస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలాలు, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పట్టణవాసులు చూసుకోవాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, […]
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని మార్కెట్, న్యూ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన కూరగాయల, మటన్ మార్కెట్ తో పాటు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చేపల మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి పరిశీలించారు. అమ్మకాలు జరిపే వారు […]