Breaking News

MULUGU

వైద్యసేవలు బాగుండాలె

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంత్ శుక్రవారం వెంకటాపురం తహసీల్దార్ ఆఫీసు మరమ్మతులు పరిశీలించారు. అనంతరం ఎదిరా ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అలుబక గ్రామంలో నర్సరీ మొక్కలు పరిశీలించారు. హరితహారం కింద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్​ చుట్టాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడుగుంతలు పనులను కంప్లీట్​ చేయాలన్నారు. పంచాయతీలకు […]

Read More

సబ్ రిజిస్ట్రార్ చేయూత

సారథి న్యూస్, ములుగు: రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి, తినడానికి తిండి లేదు. నిలువ నీడ లేదు, విధి వెక్కిరించి వీధినపడ్డ ఓ నిరుపేద కుటుంబానికి చేయుతనందించి సహృదయాన్ని చాటుకున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రెడ్డబోయిన రాజు, మానస దంపతులకు వైష్ణవి, తేజశ్విని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో రాజు కాలు […]

Read More

అంగన్వాడీ టీచర్ల భర్తీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్​ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]

Read More

వైద్య సిబ్బందికి కరోనా టెస్టులు

సారథిన్యూస్​ ములుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న 25 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్​ సేకరించారు. శాంపిళ్లను పరీక్షల కోసం వరంగల్​లోని కాకతీయ మెడికల్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.

Read More

మాస్కులు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు మండలం బాలలక్ష్మీపురం గ్రామంలో ఎస్సై తిరుపతిరావు బుధవారం మాస్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్యాసతీసుకోడం ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.

Read More

టీబీ నిర్ధారణ టెస్టులు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు హెల్త్​ సెంటర్​లో క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి క్షయవ్యాధి(టీబీ) నిర్ధారణ కోసం వైద్యాధికారుల బృందం తెమడను సేకరించింది. బాధితులకు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. అనంతరంపై కరోనాపై జాగ్రత్తలను వివరించారు. తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్​ యమున, కోటిరెడ్డి, ఈశ్వరమ్మ, శరత్ బాబు, రవి, రజినీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.

Read More

ప్రజావాణి వినతుల స్వీకరణ

సారథి న్యూస్, ములుగు: కలెక్టరేట్ లో ప్రజల నుంచి సోమవారం విజ్ఞప్తులు స్వీకరించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య తెలిపారు. భూసమస్యలకు సంబంధించి 25, సదరం పెన్షన్లకు సంబంధించి మూడు, ఇతర శాఖలకు సంబంధించి మూడు .. మొత్తం 31 విజ్ఞప్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటించి, వచ్చిన దరఖాస్తులను శానిటైజేషన్​ కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్క్​లు తప్పకుండా కట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్​ సూచించారు.

Read More
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిస్తున్న ప్రైవట్​ టీచర్లు

కష్టాల్లో ప్రైవేట్​ టీచర్లు

సారథి న్యూస్, ములుగు: లాక్​డౌన్​తో ప్రైవేట్​ స్కూల్​ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్​ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.

Read More