సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, జలవనరులు నీటిమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ములుగు జిల్లాలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి సమీపంలోని ఏటూరునాగరం గ్రామంలోని లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని తరలించారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో […]
సారథి న్యూస్, వాజేడు: ఒక్కసారిగా ఊరంతా దుర్వాసన లేచింది. కరోనా నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఊరులో ఏం జరిగిందని ఆరాతీయడం మొదలుపెట్టారు. తీరా విషయం ఏమిటంటే.. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు పంచాయతీ ఆఫీసు పక్కన ఉన్న చింతచెట్టు కొమ్మలను పదిరోజుల క్రితం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. కొమ్మలపై కొంగ గుడ్లు, పిల్లలు పదులసంఖ్యలో ఉన్నాయి. చెట్లు నరికిన సమయంలో అవి కింద 50 పిల్లల మేర చనిపోయాయి. అంతేకాదు గుడ్లన్నీ పగిలిపోయాయి. వాటిని […]
సారథి న్యూస్, వాజేడు: 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వాజేడు నాగారం పంచాయతీలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సెక్రటరీ అశోక్, పెనుగోలు కాలనీలో అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి, మల్లక్క, పెద్దగొళ్లగూడెంలో సర్పంచ్ మేనక, సెక్రటరీ శిరీష, మెురుమూరులో పూసం నరేశ్, సెక్రటరీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి గ్రామంలో వైద్యాధికారులు 42 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా టెస్టులు చేసిన వారిలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎల్టీ శ్రీనివాసరావు, రాజేష్, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లలిత కుమారి, కోటిరెడ్డి ఉన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.
సారథి న్యూస్, ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా ఆ జిల్లా ఓఎస్డీ కె. సురేష్ కుమార్ ఆయుధాన్ని చేతబట్టి స్పెషల్ పార్టీ సీఆర్పీఎఫ్ బలగాలతో అర్ధరాత్రిలో ములుగు జిల్లాలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో వారి కదలికలపై నిఘావర్గాల సమాచారాన్ని సేకరిస్తూ వ్యూహాత్మకంగా వారిని నిరోధించడంలో పోలీస్ బలగాలకు మార్గనిర్దేశం చేశారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]