Breaking News

MRO

ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు

పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథిన్యూస్, చొప్పదండి: కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్​ అంబటి రజితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని .. వెంటనే కోవిడ్​19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో […]

Read More

చెరువులు కబ్జా చేస్తే కేసులు

సారథిన్యూస్​, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్​, ఆర్​ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.

Read More