Breaking News

MINISTER

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి అజయ్​

రైతు వేదికలు దేశానికే తలమానికం

సారథిన్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్​ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల […]

Read More

వ్యవసాయం సంస్కృతిలో భాగం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, […]

Read More
షార్ట్ న్యూస్

ఇంటికే కరోనా కిట్‌

సారథిన్యూస్​, హైదరాబాద్‌: హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్​కిట్​’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్​లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్​ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఐసొలేషన్‌ అవస్థలను తప్పించడానికే..రాష్ట్రంలో రోజురోజుకు […]

Read More

జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివి

సారథిన్యూస్​, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో […]

Read More

హోంక్వారంటైన్ లోకి ​జార్ఖండ్​ సీఎం

రాంచీ: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్​ ఠాకూర్​, పార్టీ ఎమ్మెల్యే మథుర మహకు కరోనా పాజిటివ్​ రావడంతో సోరెన్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే తాను స్వీయనిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్​ సోరెన్​ ట్వీట్​ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు హోంక్వారంటైన్​కు వెళ్లాలని ఆయన కోరారు. తాను ఇంటినుంచే ముఖ్యమైన పనులు నిర్వహిస్తానని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన […]

Read More

బాధిత కుటుంబాలకు పరామర్శ

సారథి న్యూస్, వరంగల్: ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలుర కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్​ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆమె బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. శనివారం గోడతండాకు చెందిన గిరిజన పిల్లలు ఇస్లావత్​ లోకేశ్​, రాకేశ్​, జగన్​, దినేశ్​ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, మున్సిపల్ […]

Read More

పీవీ.. గొప్ప రాజనీతిజ్ఞుడు

సారథి న్యూస్​, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్​లో మంత్రి పువ్వాడ అజయ్​, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్​లో […]

Read More

హెచ్​బీటీలను ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్​ స్కూల్​, కాలేజ్​లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్​ టీచర్లు (హెచ్​బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్​కు వినతిపత్రం సమర్పించారు. లాక్​డౌన్​ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్​, శ్రీనివాస్​, పూర్ణచందర్​, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

Read More