Breaking News

medak

నిబంధనలు పాటించని షాప్ సీజ్

నిబంధనలు పాటించని షాప్ సీజ్

సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం నిర్ధేశించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వస్త్రదుకాణాన్ని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ సోమవారం సీజ్ చేసినట్లు ప్రకటించారు. పెద్దశంకరంపేటలో ఉదయం 10 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉండటంతో ఎండీ ఆబిద్ హుస్సేన్ క్లాత్ మర్చంట్ దుకాణాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర పని ఉంటేనే బయటికిరావాలని సూచించారు. నాందేడ్ అకోలా -హైదరాబాద్ 161వ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. […]

Read More
కాల్చొద్దు.. కలియ దున్నుదాం

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

పంటల వ్యర్థాలను దున్ని భూసారం పెంచవచ్చు పొలాల్లో నిప్పుతో పంటకు ముప్పే అవగాహన లేక వరిగడ్డి, పత్తిలొట్టను కాలుస్తున్న రైతులు హాని కలుగుతుందంటున్న వ్యవసాయ నిపుణులు వరి కోతల తర్వాత రైతులు వరి పండించిన మడులలో ఉన్న వరి గడ్డిని మంటపెడుతుంటారు. దీంతో నేలకు సారాన్ని ఇచ్చే క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు భూసారం సమతుల్యత దెబ్బతిని తద్వారా సాగుచేసే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి గడ్డిని కాల్చివేయకుండా భూమిలోనే కలియ దున్నితే ప్రయోజనకరంగా ఉంటుందని […]

Read More
రూల్స్ పాటించని షాపులకు జరిమానా

రూల్స్ పాటించని షాపులకు జరిమానా

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా  విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]

Read More
బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]

Read More
కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More
పంటను దళారులకు అమ్ముకోవద్దు

పంటను దళారులకు అమ్ముకోవద్దు

సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్​జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు […]

Read More
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ […]

Read More
కరోనా టెస్టుల కోసం బారులు

కరోనా టెస్టుల కోసం బారులు

20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిరాశతో వెనుదిరుగుతున్న జనం తాజాగా కొవిడ్​తో వృద్ధుడు మృతి, అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​ రావు సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే […]

Read More