గ్రీన్ జోన్‌లోనూ ఇద్దరి పాజిటివ్ మెదక్‌లో చాపకింద నీరు మహమ్మారి సారథి న్యూస్, మెదక్: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లాలో అల్లిపూర్ గ్రామం పేరు చెబితేనే.. ఠక్కున గుర్తుకొచ్చేది తాటి ముంజలే. ఇక్కడ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా ఉన్న తాటిచెట్లు గ్రామానికి వన్నె తెచ్చేలా ఉన్నప్పటికీ కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది. మండల కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న అలీపూర్ గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో తాటి వనాలు ఉన్నాయి. మే నెలలో వాటి అమ్మకాలతో ఈ […]
ఆడుకుంటూ వెళ్లి అందులోపడ్డ బాలుడు సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు. బుధవారం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం 120 నుంచి 150 అడుగుల లోతులో బాలుడు ఉన్నాడు. రెస్య్యూటీమ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. సంఘటన స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకుని పనులు చేపట్టాయి. మెదక్ […]
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, మెదక్: వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి జూన్ 10వ తేదీ నాటికి రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో రైతులకు నియంత్రిత సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతులకు రైతుబంధు కోసం రూ.ఏడువేల కోట్లు అవసరం ఉండగా, ఇప్పటికే రూ.3,500 కోట్లు వ్యవసాయశాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు అవసరం […]
సారథి న్యూస్, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.
మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు, పంటమార్పిడి విధానంపై జిల్లా రైతులను చైతన్యం చేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమీక్షించారు. ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్లి వారికి మాట్లాడి పంటసేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఏఈవోలు వద్ద ఉండాలన్నారు. నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు […]
నాందేడ్ – ఆకొలా హైవేపై ఘటన సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో గురువారం నాందేడ్ – ఆకొలా హైవేపై అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఓ వ్యక్తి తల మొండెం నుంచి వేరుపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అల్లాదుర్గం మండలం రాంపూర్ లోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. రోజు […]
-మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, మెదక్: వృథానీటికి అడ్డుకట్ట వేయడం, భూగర్భ జలాల పెంపు, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూ.1200 కోట్ల నాబార్డ్ నిధులతో రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ లు నిర్మిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బుధవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి హవేలిఘనపూర్ మండలం సర్ధన వద్ద మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హవేలి ఘనపూర్‌లో డబుల్ బెడ్ రూం […]