సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్‌బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు […]
సారథి న్యూస్, రామాయంపేట: అగస్టు 15 కల్లా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఆరో విడుత హరితహారం సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లాలో ని 75 క్లస్టర్ లలో రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో పరుశురాం నాయక్, మెదక్ ఆర్డీవో సాయిరాం, ఏడీ ఏ వసంత సుగుణ, తహసీల్దార్ జయరామ్, వ్యవసాయాధికారి సతీశ్, ఎంపీపీ సిద్ధరాములు, జెడ్పీటీసీ విజయ్ కుమార్, […]
సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]
సారథి న్యూస్, మెదక్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మెదక్ జిల్లాను ముందంజలో నిలపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. అందుకోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణాల్లో తడి, పొడి చెత్తపై […]
సారథి న్యూస్, మెదక్: రాష్ట్రంలో పచ్చదనం పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం పాతూరు, సుల్తాన్ పూర్ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని మెదక్ అడిషనల్కలెక్టర్ నగేష్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్మెంట్కమిషనర్ రఘునందన్ రావు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ నుంచి అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రకృతి వనాలను నిర్మించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ జరిపి వాటిని చదును చేసి వాటిలో ఎరువులు వేసి నేలను […]
నర్సాపూర్ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్ టవర్‌లు, వాకింగ్, సైకిల్ ట్రాక్‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కులు, రిసార్ట్స్‌లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్‌లో అన్ని హంగులతో అర్బన్ పార్క్ రెడీ అయింది..కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక […]
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]