Breaking News

medak

చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
పందులకు పెట్టిన వైరు.. తండ్రికొడుకుల ప్రాణాలు తీసింది

పందులకు పెట్టిన వైరు.. ప్రాణాలు తీసింది

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరెంట్ ​షాక్​తో తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఇస్కపాయల తండా పంచాయతీ పరిధిలోని కొలపల్లితండాకు చెందిన ధారవత్ హర్యానాయక్(51) కొలపల్లికి చెందిన చాకలి సాయిలు పొలాన్ని కౌలుకు పంట సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి పొలాన్ని నీళ్లు చూసేందుకు వెళ్లాడు. పక్క పొలానికి చెందిన చాకలి లింగం అడవి పందుల కోసం కరెంట్ వైర్ బిగించాడు. […]

Read More
మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్​సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్​వైజర్​గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్​మెన్​గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్​ సీడ్​ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్​కు […]

Read More
వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్​ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం […]

Read More
జలదిగ్బంధంలో వనదుర్గమ్మ

జలదిగ్బంధంలో వనదుర్గమ్మ

సారథి న్యూస్, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరా నదికి వరద ఉదృతి సంతరించుకుంది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ప్రధాన ఆలయ ముందు ఉన్న నదీ పాయ పరవళ్ల తొక్కుతుండడంతో మండపంలోకి నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు […]

Read More
భారీ వర్షం.. మెతుకుసీమ జలసంద్రం

మెతుకుసీమ జలసంద్రం

సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ […]

Read More
జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

సారథి న్యూస్, రామాయంపేట: వర్షాలకు కింద పడిపోయిన వరి పంటను జడలు చుట్టే పద్ధతిలో కట్టుకుంటే పంటను రైతులు కాపాడుకోవచ్చని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. ఆయన సోమవారం మండల పరిధిలోని నస్కల్, చౌకత్ పల్లి, కల్వకుంట, తిప్పనగుళ్ల గ్రామాల్లో నేలకు ఒరిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. గింజగట్టి పడి కోత దశలో ఉన్న వరి పంటకు 50 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]

Read More
కో ఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక

కోఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా నర్సింలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.

Read More