సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని ఆవాసిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రకటించారు. పెండింగ్ పనులను కంప్లీట్‌చేసి సింగూర్ ద్వారా మంచినీటిని అందిస్తామని, అలాగే కోమటిబండ ద్వారా శివ్వంపేటలో నిర్మిస్తున్న సంపును పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి తాగునీటి సరఫరా, నీటిపారుదల, […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో శుక్రవారం పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్ సరిత మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతివనం చుట్టూ ఫెన్సింగ్ చుట్టి తొందరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమావత్ రాజు, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, టీఎస్ సుభాష్, విఠల్ నాయక్, విజయ్, కోటయ్య పాల్గొన్నారు.పల్లె ప్రగతి పనులపై ఆరామండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర […]
సారథి న్యూస్, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని […]
సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 16,971 మంది రైతుల నుంచి 51,746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.51కోట్లను వారి ఖాతాలో జమచేశామని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కూడా కొని మిల్లులకు తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేవని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో బుధవారం 43 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ ఎలిజిబెత్ రాణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పాజిటివ్వచ్చినవారు అధైర్యపడొద్దని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహించిన వారిలో ఏఎన్ఎం రేణుక, ఆశావర్కర్లు సంతోష, రేఖ, పుష్ప, మమత […]
సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్‌రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]