సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]
సారథి న్యూస్, మెదక్: జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ(ఎస్సీ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఈ ఏడాది 448 మంది లబ్ధిదారులకు రూ.19.18 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో రూ.12.35 కోట్ల సబ్సిడీ కాగా, రూ.6.63 కోట్ల బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ ద్వారా అమలుచేస్తున్న రూ.లక్షలోపు పథకాలకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల్లోపు పథకాలకు […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్–19 వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ శ్రావణి శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్ను మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్త్, పోలీస్, శానిటేషన్ సిబ్బందికి, తర్వాత 60 ఏళ్లు పైబడిన, మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి, చివరగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. […]
సారథి న్యూస్, రామాయంపేట: రామాయంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల వివాహానికి మెదక్జిల్లా నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పుస్తెమట్టెలను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అబ్దుల్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని చిన్నశంకరంపేట ఎస్సై మహమ్మద్ గౌస్ ఆకాంక్షించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మహిళా మండలి అధ్యక్షురాలు గంగ, మహిళలతో కలిసి ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగ మాట్లాడుతూ.. మహిళా సమస్యలు, ఆడపడుచుల మిస్సింగ్ కేసులు, భార్యాభర్తల గొడవలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తున్న పోలీసుల సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్సై గంగయ్య, హెడ్ […]
సారథి న్యూస్, మెదక్: ఈ యాసంగి సీజన్లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాసంగి సీజన్ కు మెదక్ జిల్లాలో 7,672 మంది రైతులు అర్హులుగా గుర్తించామని, ఈ నెల 21లోపు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. జూన్ నుంచి ఈనెల 10 వరకు కొత్త పట్టాదారు పాస్ […]
సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పేద, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కౌన్సిలర్ లతో కలిసి 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]