Breaking News

medak

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలి

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: విద్యార్థులు వినయం, విజ్ఞానం, ఆరోగ్యం వంటి మూడు సూత్రాలను పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయలక్ష్మి సూచించారు. శనివారం ఆమె స్థానిక ఎస్టీ హాస్టల్ ను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందజేయడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More
రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

సారథి న్యూస్, నిజాంపేట/పెద్దశంకరంపేట: అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఊరూరా నిధుల సేకరణ చేస్తున్నారు. శుక్రవారం మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వీహెచ్ఎస్​ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు చెర్విరాల ప్రవీణ్ కుమార్, నరేష్, రాజు, నవీన్, విజయ్ మోహన్ పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేటలో శేషాచారి కుమారులు రామచంద్రాచారి, వేణుగోపాల్ చారి, మురళి పంతులు రామమందిరం నిర్మాణానికి రూ.51,116 అందజేశారు. […]

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మండలంలోని అభివృద్ధి పనులపై డీఆర్డీవో శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ, ఐకేపీ ఆఫీసులను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సముదాయ కార్యాలయం ముందున్న మొక్కలకు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మితో కలిసి నీళ్లు పట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో గణేష్ రెడ్డి […]

Read More
ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ […]

Read More
తైబందీ అమలు చేయొద్దు

తైబందీ అమలు చేయొద్దు

సారథి న్యూస్, రామాయంపేట: సుమారు పదేళ్ల తర్వాత నిండిన హైదర్​ చెరువులోని నీటిని 20,30 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం విడుదల చేయొద్దని నార్లాపూర్ ముదిరాజ్ కులస్తులు, ఇతర గ్రామస్తులు నిజాంపేట తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్, తిప్పనగుళ్ల, శోకత్ పల్లి గ్రామాలకు చెందిన ముదిరాజ్, బెస్త కులస్తులు ఈ చెరువులో 10లక్షల చేప పిల్లల మేర పెంచారని వివరించారు. నీటిని విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చెరువులో నీళ్లు ఉండడం ద్వారా […]

Read More
‘సుకన్య సమృద్ధి యోజన’ ఆడపిల్లలకు వరం

‘సుకన్య సమృద్ధి యోజన’ ఆడపిల్లలకు వరం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ పిల్లలకు వరం లాంటిదని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పోస్ట్ ఆఫీస్ లో పలువురు తల్లిదండ్రులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూతుళ్లు పుట్టిన తల్లిదండ్రులకు ఈ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్ కుమార్, బీపీఎంలు సుదర్శన్, రాఘవేందర్, గంగారాం మామయ్య, విజయ్ కుమార్, సిబ్బంది […]

Read More