సారథి న్యూస్, రామాయంపేట: సుమారు పదేళ్ల తర్వాత నిండిన హైదర్ చెరువులోని నీటిని 20,30 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం విడుదల చేయొద్దని నార్లాపూర్ ముదిరాజ్ కులస్తులు, ఇతర గ్రామస్తులు నిజాంపేట తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్, తిప్పనగుళ్ల, శోకత్ పల్లి గ్రామాలకు చెందిన ముదిరాజ్, బెస్త కులస్తులు ఈ చెరువులో 10లక్షల చేప పిల్లల మేర పెంచారని వివరించారు. నీటిని విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చెరువులో నీళ్లు ఉండడం ద్వారా భూగర్భజలాలు పెరిగి రైతులు బోరుబావుల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. సుమారు 800 కుటుంబాలకు న్యాయం చేసే చెరువును తైబందీ చేయకూడదని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నీలం యాదగిరి, అంజయ్య, రమేష్, నార్లాపూర్ ముదిరాజ్ సంఘ సభ్యులు, తిప్పనగుళ్ల బెస్త కులస్తులు పాల్గొన్నారు.
- January 28, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- medak
- NARLAPUR
- RAMAYAMPET
- THYBANDI
- తైబందీ
- నార్లాపూర్
- మెదక్
- రామాయంపేట
- Comments Off on తైబందీ అమలు చేయొద్దు