సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]
సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీమ్ పేట లో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జమునా హెచరీ యాజమాన్యం జమున, నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్ మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీమ్ పేటలో అసైన్మెంట్ […]
సామాజిక సారథి, నవాబుపేట్: దళితుల భూములు ఆక్రమిస్తే జైలుకు వెళ్లడం ఖాయమనీ మానవ హక్కుల నాయకులు రాములు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామ శివారులో గలా సర్వే నెంబర్ 53,64/2 ప్రభుత్వ పట్టా భూమి ఇనాం, గైరాన్ భూములను ఆక్రమించి రోడ్డు వేసిన వ్యక్తులు, నవాబుపేట్ మెడికల్ డాన్ సిద్దూ, రాజేష్ ప్రతినామం కొండల్, దరిపల్లి శివారు సర్వేనెంబర్ 201 పట్టడారులు వెంకటేష్ గౌడ్, వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ గౌడ్, విజయ్ రామగౌడ్, […]
సారథిన్యూస్, తలకొండపల్లి: ఆలయభూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబరు 75 లోని ఉన్న ఆలయభూమిలో కొందరు రహదారిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్. దేవాదాయశాఖ అధికారులు తగిన చొరవ తీసుకోవాలని, ఆలయ భూములు పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.