Breaking News

KOTHAGUDEM

క్టర్ కు ఆత్మీయ వీడ్కోలు

కలెక్టర్ కు ఆత్మీయ వీడ్కోలు

సారథి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పదవీకాలం ముగియనున్న సందర్భంగా వారి దంపతులను గజమాలతో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సోమవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనం కార్యక్రమాన్ని జిల్లాలో పరుగులు పెట్టించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా జిల్లా ప్రజల పరిరక్షణలో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ చేపట్టిన కార్యక్రమాలు అమోఘమైనవని కొనియాడారు. వారి శేషజీవితం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు. […]

Read More
ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​దత్​ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్​లైన్​లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్​లైన్ ​ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన […]

Read More
నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

సారథి న్యూస్, పాల్వంచ: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం దసరా పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. మంచి నీళ్లు ఇప్పించండి మహాప్రభో.. అని ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. ‘చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. కానీ తమ ఊరుకు మాత్రం రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు! ఎమ్మెల్యే గారు! మీరైనా మా బాధలను అర్థం […]

Read More

ఉద్యమకారులను అవమానించొద్దు

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read More

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.

Read More

పాల్వంచలో కరోనా విజృంభణ

సారథి న్యూస్​, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్​ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్​లను గుర్తించే పనిలో […]

Read More

అంబేద్కర్​ బాటలో నడుద్దాం

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్​ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్​ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్​ఎస్​ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్​ఎస్​ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, […]

Read More

నిరాడంబరంగా బండి సంజయ్​ జన్మదినం

సారథిన్యూస్​, కొత్తగూడెం: బండి సంజయ్​ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్​ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్​, కేక్​ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్​రెడ్డి, నాయకులు, […]

Read More