సారథి, చొప్పదండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సంజయ్ సురక్ష అనే పేరుతో వైద్యపరికరాలను బుధవారం ఆ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎవరికీ ఏ సహాయం కావాలన్నా బండి సంజయ్ ముందుంటున్నారని కొనియాడారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ హాస్పిటల్ కు […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.
సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువతో సత్కారించి లడ్డూప్రసాదం అందజేశారు.వైద్యాధికారి మహేష్ రావుకు రాజన్న ప్రసాదంరాజన్న ఆలయ ఉద్యోగులు కరోనా బారినపడకుండా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు త్వరితగతిన వాక్సిన్ ఇచ్చినందుకు 100 పడకల ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.మహేష్ రావుకు యూనియన్ అధ్యక్షుడు […]
సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట […]