Breaking News

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ​దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.

కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ను సన్మానిస్తున్న ఆలయాధికారులు, సిబ్బంది