సారథిన్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు కరోనా సోకినట్టు సమాచారం. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. లక్షణాలు కూడా ఎక్కువగా లేవని […]
పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్‌లోని దనాపూర్‌కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ […]
బ్రెజిల్: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనం మధ్య ఉండే వారిని ఒక్కసారిగా ఐసోలేషన్ అంటూ బంధిస్తే ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో కూడా అదే ఫీల్ అవుతున్నాడంట. ఎప్పుడూ జనంలో ఉంటూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఐసోలేషన్‌లో ఉండాలంటే చిరాకుగా అనిపిస్తోంది అంట. దీంతో సోమవారం మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మరోసారి పరీక్షలు చేయించుకుంటాను. […]
కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ లింగాల […]
ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్‌కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం […]
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న బాధితులకు ఇంటివద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు […]
సారథిన్యూస్, వెల్దుర్తి: పెళ్లయిన రెండోరోజే వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారైంటైన్‌కు తరలించిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కాగా అతడికి వెల్దుర్తి మండలం ఎల్ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతడి నమూనాలు సేకరించారు. అయినప్పటికి యువకుడు ఈ నెల 10న ఎల్ తండాకు వచ్చి అక్కడ యువతిని వివాహం […]