Breaking News

IJU

మెదక్​లో జర్నలిస్టుల సత్యాగ్రహం

మెదక్​లో జర్నలిస్టుల సత్యాగ్రహం

సారథి న్యూస్, మెదక్: పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్​తో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరాస్తాలో జర్నలిస్టులు సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి, యూనియన్ రాష్ట్ర […]

Read More
జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత […]

Read More

‘గాంధీ’ ఉండగా.. ‘యశోద’కు ఎందుకు?

సారథి న్యూస్​, హైదరాబాద్​: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, సీఎంకు కంటినొప్పి వచ్చినా, పంటినొప్పి వచ్చినా ఢిల్లీ పోతారని, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అందించే వైద్యంపై వారికి నమ్మకం లేదా..? అని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇది డాక్టర్లను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కు మృతికి నివాళిగా శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) […]

Read More