సారథి న్యూస్, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. బర్త్‌డే, పెండ్లి రోజు, ఇతర శుభదినాల్లో మొక్కలు నాటాలని కోరారు. బుధవారం కోహెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించడంతో పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్‌లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల […]
సారథి న్యూస్, హుస్నాబాద్: విద్యారంగ సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బీ) 70 ఏండ్లుగా పోరాడుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఏఐఎస్బీ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలుగూరి సూర్యకిరణ్, అతికం రాజశేఖర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బద్ధం ప్రవీణ్ రెడ్డి, చల్లురి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.