Breaking News

HUSNABAD

గిరిజనుల ఆత్మ బంధువు కేసీఆర్

సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మ బంధువని అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ స్వరూప, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

5వేల ఎకరాలకొక రైతువేదిక

సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు […]

Read More

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

సారథి న్యూస్, హుస్నాబాద్: అక్రమ అరెస్టులతో ఉద్యమన్ని ఆపలేరని బీజేపీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు ప్రజలను కంటతడి పెట్టిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయా బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు వేణుగోపాలరావు, మోహన్ నాయక్, నరేష్, అజయ్, కృష్ణ, కార్తీక్, సాగర్, సంపత్, సుధాకర్, కళ్యాణ్, శ్రీనాథ్, సాంబరాజు పాల్గొన్నారు

Read More

భూ నిర్వాసితులు అధైర్యపడొద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్​: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధైర్యపడొద్దని భారీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కోరారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఆఫీసర్స్ తో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టు కింద 250 ఎకరాల భూసేకరణ మిగిలి ఉందని దానిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించి నిర్వాసితులకు త్వరలోనే డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్ […]

Read More

టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం

సారథి న్యూస్, హుస్నాబాద్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్​ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజాం, సంతోష్, మల్లేశం, రాజు కుమార్, సింగారయ్య, శంకర్, శ్రీనివాస్, సుభాష్, […]

Read More

కొడుకులు చూడడం లేదని..

సారథి న్యూస్, హుస్నాబాద్: కొడుకులు తన బాగోగులు చూసుకోవడం లేదని ఓ వృద్ధుడు సోమవారం అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామపరిధిలోని శంకర్ నగర్ కు చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తనకున్న ఆస్తినంతా కొడుకులు లాక్కొని ఏ ఒక్కరూ చేరదీయకపోవడంతో అధికారులను ఆశ్రయించాడు. వృద్ధుడిచ్చిన ఫిర్యాదుకు స్పందించిన ఆర్డీవో జయచంద్రారెడ్డి మల్లయ్య గ్రామానికి వెళ్లి కొడుకులతో మాట్లాడారు. అయినా వారు వినిపించకపోవడంతో పోతు మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న […]

Read More

కరోనా కట్టడిలో విఫలం

సారథి న్యూస్​, హుస్నాబాద్ : కరోనా రోగులకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేశ్​ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్​డౌన్​ను సడలించడంతో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టెస్టులసంఖ్య పెంచాలని డిమాండ్​ చేశారు.

Read More

తండ్రిని చంపిన కొడుకు

సారథి న్యూస్​, హుస్నాబాద్: భూ తగాదాలతో ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చాడు. ఈ దారుణఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో చోటుచేసుకున్నది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గండిపల్లికి చెందిన లూనావత్ సోమ్లా నాయక్ (74)కు కొంత కాలంగా కుమారుడు సమ్మయ్యతో భూమివిషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సోమ్లానాయక్​ తన పొలం దగ్గరకు వెళ్తుండగా కుమారుడు సమ్మయ్య అడ్డగించాడు. భూమి విషయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన […]

Read More