– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]
సారథి న్యూస్, హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల ఆగడాలపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి అధికచార్జీలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అపోలో, బసవతారకం కేన్సర్ ఆస్పతులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని ఓ ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో కార్పొరేట్ దవాఖానలో దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా పేషెంట్ల నుంచి టెస్టుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టలేదన్న సాకుతో కరోనా డెడ్బాడీస్ను వదలడం లేదు. ఇటీవల ఓ వ్యక్తి కరోనాతో కార్పొరేట్ దవాఖానలో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇవ్వాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని దవాఖాన వర్గాలు తెలిపాయి. దీంతో గత్యంతరం లేని ఆ వ్యక్తి కుటుంబం ఆస్తులు అమ్మి డబ్బులు కట్టి శవాన్ని విడిపించుకున్నారు. ఇటువంటి దోపీడీలు […]
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని, హాస్పిటల్స్ వర్గాలు కావాలనే అబద్ధాలు చెబుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలు చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, వెనక్కి తిప్పి పంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ అందించాలని ఆదేశించారు. బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిందని, దాని ద్వారా వివరాలు […]