మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]
బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]
సామాజిక సారథి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాంలెజ్‌లో సినీనటి మెహ్రీన్ ఫిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించేందుకు, గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహ్రీన్ పిలుపునిచ్చారు. మెహ్రీన్‌కు గ్రీన్ ఇండియా […]