సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కోరారు. గురువారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అడవులు అంతరించి పోవడంతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ..బర్త్ డే, పెండ్లి రోజు తీపిగుర్తులకు చిహ్నాంగా ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మంగ, స్పెషలాఫీసర్ నర్సింగరావు, ఎంపీవో సుమాన్, ఏపీవో ప్రభాకర్, ఎస్సై కొత్తపల్లి రవి, సర్పంచ్ […]
సారథిన్యూస్, నెట్వర్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ […]
పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమేశ్, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజన్ […]
సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో అల్లనేరేడు మొక్కలను నాటి ప్రారంభించారు. స్థానిక పార్కులో అనేక విశిష్టతలు ఉన్నాయి. సుమారు 630 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. రూ.8కోట్ల వ్యయంతో 15కి.మీ. ప్రహరీని సిత్రు వాల్, చైన్ లింక్ ఫినిషింగ్ తో నిర్మాణ చేపట్టారు.
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. గురువారం మెదక్‌జిల్లా నర్సాపూర్అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌జిల్లా కలెక్టర్ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్‌పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 […]
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియాకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పర్యవేక్షించాలని సూచించారు.