సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ సమరయోధుడు గులాం రసూల్ ఖాన్180వ వర్ధంతిని ఆదివారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ్మయాదవ్ మాట్లాడుతూ.. సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయన్నారు. 1801లో పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో తెర్నేకల్ గ్రామస్తులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారని గుర్తుచేశారు. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 50వ పుట్టినరోజు సందర్భంగా హయత్ నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాలులో కరోనా నిబంధనలకు అనుగుణంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హయత్గర్ మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి రక్తదానం […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు శుక్రవారం తెలిపారు.డివిజన్ అధ్యక్షులు వీరే..చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం […]