Breaking News

CONGRESSS

స్నానం చేస్తున్నా వదల్లే..!

స్నానం చేస్తున్నా వదల్లే..!

కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్​చేసిన పోలీసులు వనపర్తిలో సీఎం పర్యటన నేపథ్యంలో చర్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వనపర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను మంగళవారం ముందస్తుగా అరెస్ట్​చేశారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెల్కపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్‌ స్నానం చేసేందుకు వెళ్తుండగా బాత్​రూం వద్ద నుంచే బట్టలు […]

Read More
పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండి

పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండి

సారథి న్యూస్, తాడ్వాయి: పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. శుక్రవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టభద్రులు కాంగ్రెస్​ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువతకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ […]

Read More
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్​చేశారు. ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు పేద‌ల ప‌క్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంద‌న్నారు. చ‌దువుకున్న మేథావులంతా పెరుగుతు‌న్న ధ‌ర‌ల‌పై ఆలోచన‌ చేయాల‌ని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మంగళవారం నాంప‌ల్లి గృహ‌క‌ల్ప వ‌ద్ద మ‌హిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయ‌నతో పాటు ఎమ్మెల్యే సీత‌క్క, అధికార […]

Read More
బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం […]

Read More
రౌండ్ రౌండ్ కు టెన్షన్​

రౌండ్ రౌండ్ కు టెన్షన్​

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్​ దోబూచులాట కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ […]

Read More
బహిరంగ చర్చకు సిద్ధమేనా?

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్​అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]

Read More

కరోనాతో కాంగ్రెస్​ ఎంపీ మృతి

చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్​కుమార్​ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు​ 10న వసంత్​కుమార్​ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్​ సంతాపం తెలిపారు. వసంత్​కుమార్​ మృతి కాంగ్రెస్​ తీరని […]

Read More
రాహుల్‌ మరింత యాక్టివ్‌గా ఉండాలి

రాహుల్‌ మరింత యాక్టివ్‌గా ఉండాలి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోషల్‌ మీడియాలో డిమాండ్‌ లేవనెత్తారు. కాంగ్రెస్‌ లీడర్లతో ఫ్యామిలీకి సంబంధించి వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. కాగా, చాలామంది సీనియర్‌‌ లీడర్లు ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ కూడా దీనిపై స్పందించారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో ఇంకా యాక్టివ్‌గా ఉండాలని, ఆయన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరారు. […]

Read More