సారథి న్యూస్, వనపర్తి: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద రైతులు, వలస కూలీలతో పాటు పారిశ్రామిక రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు బ్యాంకర్లు నిర్దేశించిన గడువు కంటే ముందుగానే లోన్లు ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక ప్రోత్సాహం కింద చేయూత ఇవ్వాలని సూచించారు. బ్యాంకుల వారీగా ఉన్న […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి 2016–19 సంవత్సరానికి మంజూరైన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణంలో ప్రజల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపికచేసింది. ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, ఇంకొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఫేమ్ ఇండియా సంస్థ వీరిద్దరి గత నాలుగు నెలల పనితనం ఆధారంగా ఈ జాబితాకు ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా […]
సారథి న్యూస్, మెదక్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాల పంపిణీ ప్రక్రియను ఈనెల 10వ తేదీ వరకు పూర్తిచేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా పశువైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో పాడి రైతులు, మేకలు, గొర్రెల కోసం హరితహారం కార్యక్రమంలో తుమ్మ, సుబాబుల్, అవిసె, సూపర్ నేవియర్ గడ్డివేయాలని సూచించారు. అధికారులు ఈ సీజన్లో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాడి పశువులకు బీమా చేయించే విషయమై అవగాహన […]
సారథి న్యూస్, నర్సాపూర్: రైతులు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నియంత్రణ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని మహమ్మద్ నగర్, సలాబత్ పూర్ గ్రామాల్లో సదస్సులను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ..దేశంలో పప్పుదినుసుల పంటల సాగు తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం భారం పడుతుందని, కనుక […]
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు రైతులకు సూచించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ మండలం ఏనుగొండలో వానాకాలం వ్యవసాయ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా పంట మార్పిడి చేయాలని, మొక్క జొన్న వేయవద్దని కోరారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలం గుర్తించామని, త్వరలోనే నిర్మాణం […]
మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనికల్పించాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 13 మండలాల్లో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పనులు […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కంటైన్ మెంట్ జోన్ పీఎన్ కాలనీలో కలెక్టర్ జె.నివాస్ శనివారం పర్యటించారు. ప్రజలకు సౌకర్యాలు ఏ మేరకు అందుతున్నాయో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కాలనీలో ప్రతిఇంటికి తాగునీరు, కిరాణా సామగ్రి, కూరగాయలు, మందులు నిత్యావసర సరుకులు విధిగా అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కూడా పాలు, సిరిలాక్ వంటి బేబీ ఆహార పదార్థాలను అందజేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ […]