సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్ నగర్‌లో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, […]
తాడేపల్లి: ‘ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదు. పనిగట్టుకొని సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఆయనను ప్రజలు చెప్పులతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉన్నది’ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందేమోనని అనుమానంగా ఉందని […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసపాలన కొనసాగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారందని ఈ రాక్షస ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇంతకంటే ఈ రాష్ట్రంలో దారుణమైన విషయం ఏముంటది అనిపేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని […]
నెల్లూరు : దేశవ్యాప్తంగా ప్రజానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా ఉధృతి అంతరిక్ష కేంద్రానికీ పాకింది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్ సెంటర్‌లో గడిచిన నాలుగు రోజుల్లోనే వంద కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే అక్కడ 41 మందికి పాజిటివ్ గా తేలింది. షార్ వద్ద ఏపీ ప్రభుత్వం సంజీవని బస్సు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నా.. వైరస్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ.. గత మూడు రోజుల్లో […]
అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]
విజయవాడ: అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జనలో ఉన్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది […]
తాడేపల్లి: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాధాకృష్ణ ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యానించారు. ‘రాధాకృష్ణ నువ్వు తల్లిపాలు తాగావా.. లేక నాగుపాము విషం తాగి పెరిగావా? నీ బతుకంతా కుట్రలు పన్నడమే. విషసర్పంలా ఏపీ సర్కార్ వెంటపడ్డావు’ అంటూ ఫైర్ అయ్యారు. ‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో కలెక్టర్లపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జోగి రమేశ్ స్పందించారు. ఆదివారం ఆయన […]
బాధితుల పట్ల మానవత్వం చూపాలి సెప్టెంబర్ 7లోగా పంటనష్టంపై అంచనాలు వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితుల పట్ల మానవత్వం చూపాలని హితబోధ చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ‘స్పందన’ […]