ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే […]
ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్‌టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]
సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రపథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీప్ ఆచారి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అందిస్తున్నా.. వాటిని సద్వనియోగం చేసుకోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణ […]