Breaking News

CARONA

జీహెచ్​ఎంసీ మేయర్​ రామ్మోహన్​కు కరోనా

మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్​ ట్వీట్​ చేశారు.

Read More
నాకు కరోనా తగ్గింది

నాకు కరోనా తగ్గింది

తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్​ హీరోయిన్​, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్​ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్​ లైఫ్​ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్​మెంట్​ తీసుకున్నాను. […]

Read More
కనికరించని కన్నకొడుకు

కనికరించని కన్నకొడుకు

సారథి న్యూస్​, హైదరాబాద్​ : కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్​ చేశారు. ఆమె సంతోషంతో తిరిగి ఇంటికొచ్చింది.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంటికి వస్తే కొడుకు షాకిచ్చాడు.. ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ బీజేఆర్‌ నగర్‌లో ఓ మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్‌ చేశారు. […]

Read More
కరోనా కలకలం

కృష్ణా కలెక్టరేట్​లో కరోనా కలకలం

సారథి న్యూస్​, కృష్ణా : ఆంధ్రప్రదేశ్​ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్​ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.

Read More
తెలంగాణలో 1,593 కరోనా కేసులు

తెలంగాణలో 1,593 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయి, శనివారం మీడియా బులెటిన్​ విడుదల చేయని ప్రభుత్వం అన్ని వివరాలతో ఆదివారం రిలీజ్ ​చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,264 మంది కరోనా […]

Read More
అంబులెన్స్​ ఫీజు తొమ్మిదివేలు

6 కి.మీ.. రూ. 9,000

కోల్‌కతా : కరోనా వైరస్​తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. కోల్​కతాలో ఆరు కి.మీ.దూరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్​ డ్రైవర్​ రూ.9200 డిమాండ్​ చేశాడు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ.2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్‌-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం […]

Read More
ఓకే రోజు 48 వేల కేసులు

48వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 48,661 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,42,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 62 లక్షల పైచిలుకు పరీక్షలు చేశారు. మొత్తం కేసుల సంఖ్య 13,85,522 కు చేరుకున్నది. 32 వేల మంది మృతిచెందారు. 9 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,67,882 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
విశాల్​కు కరోనా

తమిళ హీరో విశాల్​కు కరోనా

తమిళ హీరో, నిర్మాత విశాల్​కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్​ సోషల్​మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్​కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా […]

Read More