Breaking News

CARONA

రష్యా వ్యాక్సిన్​పై అనుమానాలు

రష్యా వ్యాక్సిన్‌పై అనుమానాలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే […]

Read More
చిరరి దశకు కరోనా ట్రయల్స్​

చివరి దశలో క్లినికల్ ట్రయల్స్

సారథి న్యూస్​, హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య […]

Read More
తెలంగాణలో 1,897 కేసులు

తెలంగాణలో 1,897 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544 నమోదైంది. తాజాగా కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 654కు చేరింది. 24 గంటల్లో 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదిలాఉండగా, కరోనా నుంచి కొత్తగా 1920 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధిబారి నుంచి […]

Read More

రికవరీ రేటు 70.38 శాతం

ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ […]

Read More
గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి గ్రామంలో వైద్యాధికారులు 42 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా టెస్టులు చేసిన వారిలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎల్టీ శ్రీనివాసరావు, రాజేష్, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లలిత కుమారి, కోటిరెడ్డి ఉన్నారు.

Read More

కరోనాకు జర్నలిస్టు బలి

సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్​ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్​ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్​ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More

67 టెస్టులు.. 21 పాజిటివ్​

సారథిన్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్​ పట్టణంలో 14 మందికి, శాంతినగర్​లో 1, కాశాపూర్​లో 1, పుల్లూర్​లో 2, బుక్కపూర్​లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్​లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.మనోపాడ్ మండలంలో..36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ […]

Read More
దేశంలో వైద్యసదుపాయాలు పెరగాలి

వైద్యసదుపాయాలు మెరుగుపడాలె

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.కరోనా […]

Read More