Breaking News

BOOKS

విద్యార్థులే తెలంగాణ సంపద

సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Read More

​ఆన్​లైన్​లో 1 నుంచి ఇంటర్​ టెక్ట్స్ బుక్స్

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఎస్​సీఈఆర్టీ 1నుంచి ఇంటర్​మీడియట్​ వరకు అన్ని రకాల స్కూలు టెక్ట్స్​​ బుక్స్​ ను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది. ఇవి పీడీఎఫ్ రూపంలో ఈ వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కావాల్సిన వారు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.Telangana Board Textbooks @scert.telangana.gov.in

Read More