Breaking News

BHUPALREDDY

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
నల్లవాగుకు జలకళ

నయనానందకరం నల్లవాగు

నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్​ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్​ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా […]

Read More

ప్రజాశ్రేయస్సే లక్ష్యం

సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్​ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
కార్యకర్తలతోకలిసి సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి

నారాయణఖేడ్, సారథి న్యూస్: సీఎం కేసీఆర్​ రైతుల పక్షపాతని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు విడుదల చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ అని కొనియాడారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, సర్పంచ్ పూజ కృష్ణ ముదిరాజ్ టీఆర్​ఎస్​ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More