టోర్నీ నిరవధిక వాయిదా సేఫ్ ప్లేస్ లోకి ప్లేయర్స్ బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. […]
దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. […]
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]
రాజ్‌కోట్: ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తీవ్ర విమర్శలు చేశాడు. సంక్షోభకాలంలో పదవుల నుంచి తప్పుకోవడం అతనికి అలవాటైందని ధ్వజమెత్తాడు. ‘2015లో బీసీసీఐ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఐసీసీకి వెళ్లాడు. ఇప్పుడు బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చాకా.. స్వలాభం కోసం బోర్డు (ఐసీసీ)ను వాడుకోలేనని తెలిసిపోయింది. దీంతో కరోనా కాలంలో అంతర్జాతీయ బాడీ నుంచి పారిపోతున్నాడు. మనోహర్ సొంత లాభం కోసమే పనిచేస్తాడు. […]
న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం […]
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా […]
న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్ షిప్ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా […]
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం తీసుకోవడంలో.. ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ వల్ల కాదని చెప్పినా.. ఐసీసీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ‘నిర్వాహణ దేశమే వద్దు అంటుంటే.. ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తుందా? ఎందుకీ నాన్చుడు ధోరణి. నిర్ణయాన్ని ప్రకటించే హక్కు ఐసీసీకి ఉన్నా.. ఇతర దేశాల సిరీస్లు, ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిర్ణయం ఎంత ఆలస్యమైతే.. అంతర్జాతీయ షెడ్యూల్ […]