Breaking News

BATHUKAMMA

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పేద, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి అన్నారు. కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కౌన్సిలర్ లతో కలిసి 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు […]

Read More
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.

Read More
ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

సారథి న్యూస్, రామాయంపేట: ‘పోయి రా బతుకమ్మ పోయి రావమ్మ’ అంటూ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఊరుఊరంతా తంగేడు వనలైనవి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. గన్నేరు పువ్వొప్పునే గౌరమ్మ.. శివ శివ శివ.. ఉయ్యాల్లో.. శివుడా .. నిన్ను తలుతూ’ అడబిడ్డలు బతుకమ్మ పాటలు హోరెత్తినయ్. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఆడిపాడారు. పల్లెపదం పాడుతూ పాదం కలిపారు. బతుకమ్మల సంబురాలు అంబరాన్నంటాయి. లయబద్ధంగా అడుగులు వేస్తూ.. పాటలతో చప్పట్లు కొడుతూ.. భూతల్లికి […]

Read More
వర్షాలు కురుస్తున్నయ్.. మంత్రి, ఎంపీ ఎక్కడ?

వర్షాలు కురుస్తున్నయ్.. మంత్రి, ఎంపీ ఎక్కడ?

సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో రైతులు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన సివిల్ సప్లయీస్ ​మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్​ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్ ప్రశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ అకాలవర్షంతో అల్లాడుతున్న రైతులపై లేదన్నారు. కనీసం రైతులకు భరోసా కల్పించే సమయం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను […]

Read More
బతుకమ్మ చీరలు పంపిణీ

బతుకమ్మ చీరలు పంపిణీ

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీని శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్​ కోమల్ రెడ్డి, […]

Read More
ఇంటింటా బతుకమ్మ జరుపుకోవాలి

ఇంటింటా సంతోషంగా నిండాలని..

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]

Read More